- మా జైత్రయాత్రని గౌరవించి, మా ఏలుబడి ని అంగీకరింఛి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం.... సమయం లేదు మిత్రమా... శరణమా..? లేక రణమా...?
- ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం ఇక ఉనికిని చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పర దేశపు నెత్తుటి తో ప్రక్షాళన కావిద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం.
- మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు. రాజసూయ యాగానికి అర్హుడు.
- అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి ఉప్పొగిందా ఒక్కడు ఒక్కడూ మిగలడు.
- నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీరు తాగి ముందుకు ఉడుకుతున్న నా గుర్రపు గిత్తకంటిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలుకొట్టుకొని వస్తున్నా తస్మాత్...!!!
- బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రధములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వీడ భూమి వేరులం.
- తాత నువ్వు చంపుతావా?? నన్ను చంపమంటావా?
- ఓడించి మారలేదు, క్షమించా మారలేదు. వధించా ఇక మారాల్సిన అవసరం లేదు.
- శరణమంటే రక్ష, రణమంటే మరణ బిక్ష. శరణము..? రణమా..?
- మీరు కడుపున మోసింది మనిషిని కాదు మారణహోమాన్ని మహాయుద్ధంన్ని.
- ఈ ముప్పదిమూడు కరవాలాలు కరిగించి మహా ఖడ్గాన్ని తాయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీద వున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి.
Comments
Post a Comment