ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి ? జాతి నెపమున సూత సూతసుతునికిందు నిలు అర్హత లేదందువా .. ఎంత మాట ఎంత మాట ... ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరిక్ష కాదే ... కాదు కాకూడదు .. ఇది కుల పరీక్షయేఅందువ .... నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది ? అతి జుబుక్షాకరమైన నీ సంభవమెట్టిది ... మట్టి కుండ లో పుట్టితివి కదా నీది ఏ కులము ... ఇంత ఏల అశ్వత్పితామహుడు , కురుకుల వ్రుద్దుడైన ఈ శాంతానువుడు శివ సముద్రుల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా ... ఈయనదే కులము ? నాతో చెప్పితువేమయ్యా మా వంశమునకు మూలపురుషుడైన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కదా ? ఆతడు పంచమ జాతి కన్య ఐన అరుంధతి యందు శక్తి ని , ఆ శక్తి చందాలంగిని యందు పరాసురిని , ఆ పరాసురుడు పల్లె పడచు అయిన మత్స్య కన్య యందు మా తాత వ్యాసుని , ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంభిక తో మా తండ్రి ని , పినపితామహి అంబాలిక తో మా పినతండ్రి పాండురాజు ని , మా ఇంటి దాసి తో ధర్మనిర్మాణజనుడని మీతో కీర్తించబడుతున్న ఈ విదుర దేవున్ని కనలేదా ?...